మధిర, జులై 07 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ బాటలో రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ పయనిస్తూ కార్మికుల పని గంటలు పెంచడం దారుణమని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. సోమవారం మధిర పట్టణంలోని భగత్‌సింగ్ సెంటర్ వద్ద పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రతులను పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన పని గంటల పెంపు జీఓ-282ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు లాభాలు పెంచడం కోసం, కార్మికుల శ్రమను దోపిడీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని గంటల పెంపు చేపట్టిందన్నారు.
కార్మికులకు నష్టం చేసే ఈ జీఓను తక్షణం రద్దు చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శీలం నరసింహారావు, మందా సైదులు, పార్టీ డివిజన్ నాయకులు పాపినేని రామనర్సయ్య, పట్టణ కార్యదర్శి పడకంటి మురళి, తేలపోలు రాధాకృష్ణ, ఓట్ల శంకర్రావు నాయుడు, శ్రీరాములు, గవరరాజు ధనలక్ష్మి, పెంటి వెంకట్రావు, పుచ్చకాయల కిశోర్, అప్పన శ్రీనివాసరావు పాల్గొన్నారు.