ఖమ్మం, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి కల్లూరుకు చేరుకోనున్నారు.
10.10 గంటలకు కల్లూరులో నూతనంగా నిర్మించనున్న 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, 10.30 గంటలకు నీటిపారుదలశాఖ సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 11 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతారు. అనంతరం పెనుబల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు.