భద్రాద్రి కొత్తగూడెం, మే 17 (నమస్తే తెలంగాణ)/మామిళ్లగూడెం : ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతులు, మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలచే చేపట్టిన అభివృద్ధి పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్‌నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, కొత్తగూడెం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రియాంక ఆల, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంలో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, ప్రభుత్వ సిబ్బంది పోషించిన పాత్రను అభినందించారు. అనంతరం కలెక్టర్లు గౌతమ్, ప్రియాంక ఆల మాట్లాడుతూ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలైన టాయిలెట్లు, తాగునీరు, చిన్నచిన్న మరమ్మతు పనులు పూర్తి చేస్తున్నామని, చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. పాఠశాలల పునః ప్రారంభంలోగా పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, సకాలంలో రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నామని తెలిపారు.
సీఎంఆర్ రైస్ మిల్లింగ్ ప్రక్రియ జరుగుతున్నదని పేర్కొన్నారు. సమావేశంలో ఆయా జిల్లాల అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, డీఆర్వో రాజేశ్వరి, డీఆర్డీఓ సన్యాసయ్య, ఆర్డీవోలు మధు, దామోదర్‌రావు, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ, డీసీవో రుక్మిణి, వ్యవసాయ శాఖ అధికారులు విజయనిర్మల, బాబురావు, మైనార్టీ సంక్షేమాధికారి సంజీవరావు, బీసీ సంక్షేమాధికారి ఇందిర, డీఎం సివిల్ సైప్లె త్రినాథ్‌బాబు, డీసీవో సయ్యద్ ఖుర్షీద్, డీఈవో సోమశేఖరశర్మ, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీలత, ఎస్ఈలు చంద్రమౌళి, శ్యాంప్రసాద్, జిల్లా మారెటింగ్ అధికారి అలీమ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.