కొత్తగూడెం ఎడ్యుకేషన్, డిసెంబర్ 30: కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కొత్తగూడెం, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి మండలాల స్థాయి టీఎల్ఎం మేళా జరిగింది. జిల్లావ్యాప్తంగా 120 ప్రాథమిక పాఠశాలల నుంచి 250 మంది ఉపాధ్యాయులు వెయ్యి బోధనోపకరణాల నమూనాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి డీఈవో సోమశేఖరశర్మ, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, మణుగూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, లక్ష్మీదేవిపల్లి ఎంపీపీ భూక్యా సోనా, కౌన్సిలర్స్ అఫ్జల్ ఉన్నీసా బేగం, బండారి రుక్మాంగధర్ హాజరయ్యారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు. ఉపాధ్యాయులు నమూనాలను వివరించారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డీఈవో తెలిపారు. న్యాయనిర్ణేతలు ఐదు ఉత్తమ నమూనాలను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎంఈవో జుంకీలాల్, జిల్లా సెక్టోరియల్ అధికారి సతీశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం మండలం నుంచి తెలుగు విభాగంలో లక్ష్మీభవానీ (జీపీఎస్ పాత కొత్తగూడెం), ఇంగ్లిష్‌లో పి.పద్మజ (ఎంపీపీఎస్ చిట్టిరామవరం), మ్యాథ్స్‌లో గౌషియా బేగం (జీపీఎస్ మేదరబస్తీ), ఈవీఎస్‌లో నిరీక్షణ (జీపీఎస్ కూలీలైన్), లక్ష్మీదేవిపల్లి మండలం నుంచి తెలుగు విభాగంలో కిషన్ (ఎంపీయూపీఎస్ రేగళ్ల), ఇంగ్లిష్‌లో మాధవీలత (యూపీఎస్ అనిశెట్టిపల్లి), గణితంలో డి.ప్రసూనరాణి (యూపీఎస్ అనిశెట్టిపల్లి), ఈవీఎస్‌లో మోహన్‌లాల్ (ఎంపీపీఎస్ మైలారం), చుంచుపల్లి మండలం నుంచి తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్‌లో స్వరూపాభవానీ (ఈజీఎస్ త్రీ ఇైంక్లెన్), ఈవీఎస్‌లో నాగమణి (ఎంపీపీఎస్ రాందాస్‌తండా), సుజాతనగర్ మండలం నుంచి తెలుగు విభాగంలో ఎండీ రజియా (ఎంపీపీఎస్ మంగపేట), ఇంగ్లిష్‌లో స్వప్న (జీపీఎస్ సీతంపేట బంజర), మ్యాథ్స్‌లో శారదామణి (ఎంపీపీఎస్ వేపలగడ్డ), ఈవీఎస్‌లో – ఆర్ఈ జోసెఫ్ (ఎంపీపీఎస్ గరీబ్‌పేట) విజేతలుగా నిలిచారు.