రఘునాథపాలెం, మార్చి 13: ఖమ్మంలో ‘మాంగళ్య’ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. వస్త్ర వ్యాపారంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ అన్ని రాష్ర్టాల్లో వేగంగా బ్రాంచ్‌లను విస్తరిస్తున్న ‘మాంగళ్య’ ఖమ్మం జిల్లా ప్రజల చేరువైంది. ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డులో గల ఐటీ హబ్ ఎదురుగా తన 30వ బ్రాంచ్‌ను ఏర్పాటుచేసింది. ఈ నూతన మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ నటి శ్రీలీల హాజరయ్యారు.
ఆమె రాకతో షాపింగ్ మాల్ ప్రాంగణం అభిమానుల ఈలలు, కేరింతలతో సందడిగా మారింది. ప్రారంభోత్సవానికి ముందు శ్రీలీల షాపింగ్ మాల్ ఎదుట ఏర్పాటుచేసిన వేదికపైకి వెళ్లి అభిమానులకు ‘హాయ్’ చెబుతూ సందడి చేశారు. అనంతరం షాపింగ్ మాల్ లోపలికి వెళ్లి అన్ని ఫ్లోర్లలో ఉన్న పలు రకాల వస్ర్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల్లో అధునాతన కలెక్షన్లతో నిత్య నూతన వెరైటీలతో అతిపెద్ద షాపింగ్ మాల్గా మాంగళ్య అవతరించిందని అన్నారు.
అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి షాపింగ్ మాల్ రిబ్బన్ కట్ చేయడంతోపాటు జ్యోతి ప్రజ్వలన చేశారు. మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహమూర్తి, కాసం నమశ్వివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ, ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్ర్తాలను అందుబాటు ధరల్లో అందించడమే తమ విజయ రహస్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో తమిళనాడులోనూ బ్రాంచ్‌లను విస్తరించనున్నట్లు వివరించారు. డైరెక్టర్లు విశాల్, వరుణ్, కార్తీక్, అరుణ్, పనీత్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.