– ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
– పాల్గొననున్న 13 పాఠశాలల నుండి 975 మంది విద్యార్థినులు
కారేపల్లి, డిసెంబర్ 19 : క్రీడలు జాతీయ సమైక్యతాభావాన్ని పెంచుతాయని ఖమ్మం జిల్లా మైనార్టీ గురుకుల సంక్షేమ అధికారి ఎండి.ముజాహిద్ అన్నారు. సింగరేణి మండల కేంద్రంలో గల తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజుల పాటు జరుగనున్న జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌ను శుక్రవారం ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు జాతీయ పతకాన్ని ఆవిష్కరించి క్రీడల జ్యోతిని వెలిగించి, గాలిలోకి బెలూన్లను వదిలారు. విద్యార్థినుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ బాలికలకు నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 13 పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.

Karepally : జాతీయ సమైక్యత పెంపునకు క్రీడలు దోహదం : ఎండీ.ముజాహిద్
రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకుల పాఠశాలలను స్థాపించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇందులో చదివే వారికి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని, ఇందుకోసం ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.1.35 లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నదన్నారు. దాంతో తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందని కొనియాడారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ క్రీడా పోటీలలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన 13 పాఠశాలల నుంచి 975 మంది విద్యార్థినులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.
అండర్-14, అండర్-17 విభాగాల్లో పోటీలు ఉంటాయని వాలీబాల్, ఖో ఖో, టెన్నికాయిట్, బాల్ బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ గురుకుల సంక్షేమ ఖమ్మం జిల్లా ఇన్చార్జి అధికారి శ్రీనివాస్, రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ (ఆర్ఎల్సీ) అరుణ కుమారి, డీఏసీ అప్రోజ్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల మైనార్టీ గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్ డి.సావిత్రి, పసుపులేటి శైలజ, సంగీత, గీత, అఖిల, సీత, బిపాషా, పరహిన, జ్యోతి పాల్గొన్నారు.

Karepally : జాతీయ సమైక్యత పెంపునకు క్రీడలు దోహదం : ఎండీ.ముజాహిద్

Karepally : జాతీయ సమైక్యత పెంపునకు క్రీడలు దోహదం : ఎండీ.ముజాహిద్