ఖమ్మం సిటీ, డిసెంబర్ 31: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న ‘శ్రీచైతన్య’ విద్యాసంస్థల క్రీడాపోటీలు ఆదివారంతో ముగిశాయి. మొత్తం 14 పాఠశాలల నుంచి క్రీడాకారులు పోటీలకు విచ్చేశారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, త్రో బాల్, చెస్, క్యారమ్స్, రన్నింగ్ పోటీల్లో బాల బాలికలు వేర్వేరుగా తలపడ్డారు. కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, భద్రాచలం, మహబూబాబాద్, మధిర, సత్తుపల్లి, ఖమ్మంలోని వివిధ బ్రాంచ్‌ల నుంచి వచ్చిన 1,591 మంది విద్యార్థులు పోటీలను వీక్షించారు.
ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను ఖమ్మం మమత రోడ్డులోని శ్రీచైతన్య ఒలింపియాడ్ పాఠశాల, రన్నర్ అప్ను ఖమ్మంలోని శ్రీచైతన్య సీబీఎస్ బ్రాంచ్ సాధించింది. విజేతలకు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం శ్రీచేతన్ మాధుర్, పాఠశాల ప్రిన్సిపాల్స్ టీఎల్ఎన్ శర్మ, రాజ్‌కుమార్ జోషి, ఏడుకొండలు, శ్రీదేవి, నీరజ, మురళీమోహన్, రవికుమార్ పాల్గొన్నారు.