పాల్వంచ రూరల్, ఆక్టోబర్ 17: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన పాఠశాలల స్థాయి క్రీడాపోటీలు శుక్రవారం నుంచి రెండు రోజులపాటు కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో జరగనున్నాయి. ఏర్పాట్లను డిప్యూటీ డైరెక్టర్(డీడీ) మణెమ్మ గురువారం పరిశీలించారు. వ్యాయామ ఉపాధ్యాయులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. క్రీడాపోటీలను విజయవంతం చేయడంపై చర్చించారు.
బాలికలకు 18న, బాలురకు 19న పోటీలు నిర్వహించాలన్నారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, అథ్లెటిక్స్, చెస్ తదితర క్రీడాంశాల్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించాలన్నారు. స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్రావు, దమ్మపేట ఏటీడీవో చంద్రమోహన్, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటనారాయణ, నాగేశ్వరరావు, రాంబాబు, నెహ్రూ, రామారావు తదితరులు పాల్గొన్నారు.