కొత్తగూడెం టౌన్, నవంబర్ 3: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేర కు ఈ నెల 15న భద్రాద్రి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధా న న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్ఐ యాక్టు, రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ కేసులు, కుటుంబ గొడవలు, వాహనాలు, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులు, సైబర్ క్రైం కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని, ఎక్కువగా పెండింగ్ కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ ఏర్పాటు చేశామని తెలిపారు. కేసులను ఎక్కువగా పరిష్కరించేందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ అధికారులు కృషి చేయాలని సూచించారు.