బోనకల్లు, ఆగస్టు 21 : పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని బోనకల్లు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య కోరారు. గురువారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటివరకు పిల్లలకు ఆధార్ నమోదు కానీ వారి కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలంలోని 22 గ్రామాలలోని ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. పిల్లలకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రంతో పాటు నివాస ధ్రువీకరణ పత్రాలను తల్లిదండ్రులు వెంట తీసుకు రావాలని సూచించారు.