కారేపల్లి, సెప్టెంబర్ 10 : కారేపల్లి సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం కోమట్లగూడెం గ్రామంలో సేల్ పాయింట్ ప్రారంభించారు. రైతులకు యూరియా ఇబ్బందులు తొలగించడానికి కోమట్లగూడెంలో సేల్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. సేల్ పాయింట్‌ను సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ బైరు గోపీ, ఏఓ బి.అశోక్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంత రైతులు కోమట్లగూడెం ఎరువుల విక్రయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
యూరియా డిమాండ్‌ను అధికమించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి మండలంలో మరిన్ని సేల్ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, బానోత్ హీరాలాల్, మర్సకట్ల రోషయ్య, కొత్తూరి రామారావు, డేగల ఉపేందర్, సీఈఓ బల్లు హనుమంతరావు పాల్గొన్నారు.