కారేపల్లి, ఏప్రిల్ 21 : విద్యా బోధన ద్వారానే సామాజిక చైతన్యం తెలుస్తుందని ఎంఈఓ జయరాజు అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం రావోజీతండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఊడుగు సుధాకర్ రావు, అనిత దంపతులను మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. పేరుపల్లి స్కూల్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సర్వీసు మొత్తంలో అత్యంత తక్కువ సెలవులు తీసుకున్న ఉపాధ్యాయుడిగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి సుధాకర్ రావు అని కొనియాడారు. విద్యా సేవ అంటే చిట్ట చివరి క్షణం వరకు తరగతి గదిలో బోధన చేయడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Karepalli : విద్యా బోధనతోనే సామాజిక చైతన్యం : ఎంఈఓ జయరాజు