కారేపల్లి, డిసెంబర్ 09 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కానున్నాయి. మండల వ్యాప్తంగా 41 గ్రామ పంచాయతీలు ఉండగా కారేపల్లి జనరల్, అప్పాయిగూడెం ఎస్సీ జనరల్, మిగతా 39 గ్రామ పంచాయతీలు ఎస్టీ రిజర్వ్డ్ కలిగి ఉన్నాయి. కాగా వీటిల్లో కొత్తతండా, కొత్త కమలాపురం, టేకులగూడెం, గిద్దెవారిగూడెం, బోటితండా, వెంకట్యాతండా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులకు ఒకే నామినేషన్ రావడంతో ఆ గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం అనివార్యమైంది. అందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలను ఎన్నికల అధికారులు సర్పంచ్ అభ్యర్థులకు అందజేయాల్సి ఉంది.