ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్ దివాకర్ టీఎస్
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సహకారంతో అర్హులైన ప్రతి ఓటరు వివరాలు..
ఎర్రుపాలెం, జూలై 07 : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సహకారంతో అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం తాసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఓటరు జాబితా సవరణ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని ఆదేశించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వద్ద ఉన్న ఓటర్ల వివరాలను సంబంధిత బీఎల్ఓలకు అందజేసి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు, ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అవగాహన కల్పిస్తూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు నిబంధనల మేరకు సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ కె.సునీత, ఎలిజబెత్, ఆర్ఐలు రవి కుమార్, శ్రీషా, నాయకులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, తల్లపురెడ్డి నాగిరెడ్డి, రాజీవ్ గాంధీ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

