ఎస్ఎల్బీసీ టన్నెలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ తెలుసుకునేందుకు సింగరేణి రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. రెస్క్యూ బృందం సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకు సింగరేణి సీఎండీ బలరాం సైతం ఘటనా ప్రాంతానికి వెళ్లారు.
సొరంగంలోకి రెస్క్యూ బృందం సభ్యులతో కలిసి వెళ్లి సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. 24 గంటలపాటు బృందంతోనే ఉంటూ వారిలో ధైర్యం నింపుతున్నారు. మరో 200 మంది సింగరేణి రెస్క్యూ బృందం సభ్యుల రాకతో సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయనున్నారు. సీఎండీ రెస్క్యూ బృందానికి నాయకత్వం వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 28