టేకులపల్లి, జూన్ 28 : సంస్థలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి తగిన చర్యలు చేపట్టాలని సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పోట్రు అధికారులను ఆదేశించారు. కోయగూడెం ఓసీని శనివారం సందర్శించిన ఆయన వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ బ్లాస్టింగ్, లోడింగ్ పనులను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఇల్లెందు ఏరియా జీఎం వి.కృష్ణయ్య, ఎస్వోటు జీఎం జాకీర్ హుస్సేన్, కోయగూడెం పీవో గోవిందరావు, డీజీఎం పర్సనల్ అజ్మీరా తుకారాం ఉన్నారు.