కొత్తగూడెం సింగరేణి, మే 31 : సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ బంగ్లోస్లో జీఎం స్థాయి అధికారుల కోసం నూతనంగా నిర్మించిన 14 ఎంఏ టైప్ నివాస గృహ సముదాయాన్ని సంస్థ సీఎండీ బలరాం శనివారం ప్రారంభించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం డైరెక్టర్లు సత్యనారాయణరావు, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లుతో కలిసి రిబ్బన్ కట్ చేసి గృహ సముదాయాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో అధికారుల నివాస గృహ సముదాయాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా కార్పొరేట్ పరిధిలోని రైటర్‌బస్తీ, బర్మా క్యాంప్‌లో 57 ఎంఏ అపార్ట్మెంట్ టైప్, 96 ఎంసీ టైప్, 42 ఎండీ టైప్ క్వార్టర్లు నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అనంతరం బంగ్లోస్ ఏరియాలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సీఎంవోఏఐ కార్పొరేట్ అధ్యక్షుడు వెంకటాచారి, అన్ని శాఖల జీఎంలు పాల్గొన్నారు.