మధిర, ఏప్రిల్ 08 : మధిర మున్సిపాలిటీలో గల జిలుగుమాడు శ్రీ కోదండ రామ దేవాలయ సిల్వర్ జూబ్లీ బ్రహ్మోత్సవాలను, శ్రీరాముని పట్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వాహకులు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు అనంత ఆచార్యులు తన శిష్యులతో కలిసి వేద మంత్రోత్సవాలతో స్వామివారి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా విజయ శ్రీ రామచంద్రస్వామి వారి పట్టాభిషేక విశిష్టతను వివరించారు.
ఆలయ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించిన కొఠారి రాఘవరావును ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మొండితోక జయకర్, బిక్కి కృష్ణ ప్రసాద్, రంగశెట్టి కోటేశ్వరరావు, రామారావు, కరివేదా కోటేశ్వరరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Madira : జిలుగుమాడు కోదండ రామాలయ సిల్వర్ జూబ్లీ వేడుకలు