ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 9: పదో తరగతి స్పాట్లో రిపోర్ట్ చేయని 65 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ డీఈవో సోమశేఖరశర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాల్యుయేషన్ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రిపోర్ట్ చేయకుండా విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సదరు ఉపాధ్యాయులు గురువారంలోగా వివరణ ఇవ్వాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మూల్యాంకన ప్రక్రియలో అసిస్టెంట్ ఎగ్జామినర్ల కొరత ఏర్పడడంతో పరీక్షల విభాగం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఈవో చర్యలు చేపట్టారు.