ఖమ్మం: మొగిలి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో శ్రీఅభయ హాస్పిటల్, శ్రీమిత్రా గ్రూప్ సౌజన్యంతో ఆదివారం సాయంత్రం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సినీ నటుడు మొగిలి గుణకర్ తెలిపారు. ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ఎంపికైన వాటికి అవార్డులు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కామెడి హంగామా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జబర్థస్త్ ఫేమ్ రాజమౌళి బృందం, కామెడి స్కిట్స్, ఖుషి ఖుషీగా ఫేమ్ సుధీర్, మొగిలి గుణకర్లతో స్టాండప్ కామెడి, మీనా బృందం నృత్యాలు అలరించనున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవానికి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, కురువెళ్ల ప్రవీణ్‌కుమార్ లు హాజరవుతున్నారని వెల్లడించారు. అధిక సంఖ్యలో కళాభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.