కేసీఆర్ హయాంలోనే 70 శాతం పూర్తి
సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేసిందే కేసీఆర్ అని, ఆయన హయాంలోనే కాలువలు, ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార రెండున్నరేళ్లలో రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారని, జిల్లాలో ఒక మంత్రికి పేరొస్తుందనే ఉద్దేశంతో ఇద్దరు మంత్రులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తీసుకొచ్చి హడావుడి చేశారని విమర్శించారు.
- ‘సీతారామ’కు చిన్న కాల్వను తవ్వి కాంగ్రెస్ గొప్పులు చెప్పుకుంటోంది
- రూ.19 వేల కోట్లలో రూ.10 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే కేటాయించింది
- సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లిటౌన్, జూలై 17 : సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేసిందే కేసీఆర్ అని, ఆయన హయాంలోనే కాలువలు, ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార రెండున్నరేళ్లలో రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారని, జిల్లాలో ఒక మంత్రికి పేరొస్తుందనే ఉద్దేశంతో ఇద్దరు మంత్రులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తీసుకొచ్చి హడావుడి చేశారని విమర్శించారు.
సత్తుపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం బీఎల్ఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.19వేల కోట్ల ప్రాజెక్టులో రూ.10 వేల కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం, మోటర్లు, భూసేకరణ, కాలువల తవ్వకాలకు ఖర్చు పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న కాలువ తవ్వి ఇదంతా తమ గొప్పతనమేనని చెప్పుకోవడం తగదన్నారు. యాతాలకుంట టన్నెల్ పనులకు తానే శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడం తగదని, కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద మోటర్లు ఆన్ చేస్తే గోదావరి జలాలు రైతుల పొలాలకు అందించవచ్చన్నారు.
నీళ్లు అడిగితే రక్తం చెల్లిస్తామని సీఎం స్థాయి వ్యక్తి దిగజారి మాట్లాడుతున్నారని, అవసరమైతే మా కార్యకర్తల రక్తం పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. రైతుబంధు రెండుసార్లు ఎగ్గొట్టిన విషయం రైతులకు తెలుసన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కూసంపూడి మహేశ్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, ఎస్కే చాంద్‌బాషా, అమరవరపు కృష్ణారావు, దొడ్డా శంకర్రావు, ఎండీ అయూబ్‌పాషా, కోటగిరి వెంకటరావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

