ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 30: విద్యార్థులకు ప్రయోగాత్మకంగా పాఠాలు బోధించేందుకు, సైన్స్‌పై మక్కువ పెంచేందుకు ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియం ప్రారంభోత్సవ అనుమతి కోసం ఫైల్ సిద్ధమైంది.
‘నమస్తే తెలంగాణ’లో సోమవారం ‘మ్యూజియానికి మోక్షమెప్పుడో?’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన డీఈవో సోమశేఖర శర్మ ప్రారంభానికి అవసరమైన అనుమతుల కోసం ఫైల్‌ను సిద్ధం చేశారు. ఈ వారంలో మ్యూజియం ప్రారంభోత్సవానికి అనుమతి ఇవ్వాలని ఫైల్‌ను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌కు పంపించారు.