‘బిల్లులు చెల్లించకుంటే బడికి తాళాలు’
ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరి -మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని, లేదంటే సెప్టెంబర్ 17న బడులకు తాళాలు వేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. దీనికి సంబంధించి శుక్రవారం...
– కలెక్టర్కు విన్నవించిన కాంట్రాక్టర్స్ వెల్పేర్ అసోసియేషన్
కారేపల్లి, ఆగస్టు 28 : ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరి -మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని, లేదంటే సెప్టెంబర్ 17న బడులకు తాళాలు వేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. దీనికి సంబంధించి శుక్రవారం మన ఊరు మనబడి పథకంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ కు వినతిప్రతం అందజేశారు. పనులు పూర్తి చేసిన మూడేండ్లు అయినా బిల్లులు చెల్లించలేదని, అప్పులు చేసి పనులు చేయించామని వారు వినతిలో ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులతో మానసిక ఒత్తిడి గురై ఆత్మహత్యలే శరణ్యంగా మారిందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం లోపు పెండింగ్ బిల్లులు చెల్లించాలని లేనిచో పనులు చేసినా బిల్లలు రాని బడులకు గత్యంతరం లేక తాళాలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్టర్ల బాధలు తెలుసుకుని బిల్లలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి.వసంతరావు, వి.రామిరెడ్డి, గడిపర్తి వీరభద్రరావు, ఏసుబాబు, ఎన్.శ్రీనివాసరావు, రఘు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

