ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 8: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోతుకూరి మధు కోరారు. నగరంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన పీఆర్టీయూ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల చేయాలన్నారు. కమ్యూనిటీహాల్ నిర్మాణానికి ఖమ్మంలో స్థలం కేటాయించినందుకు మంత్రి అజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం తీర్మానించింది. జిల్లాలోని 21 మండలాల నుంచి 1500 మంది ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయాలని సమావేశంలో తీర్మానించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆర్ రంగారావు, విజయ్ అమృత్‌కుమార్, చిత్తలూరి ప్రసాద్, యలమద్ది వెంకటేశ్వర్లు, డి వెంకటేశ్వరరావు, జాలె హరిత, శ్రీను, హుస్సేన్, చలపతిరావు, కట్టా శేఖర్‌రావు, రత్నకుమార్, జయమ్మ, సుమతి, సుజాత పాల్గొన్నారు.