కరకగూడెం, మే14 : గ్రామీణ మహిళల పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ క్రమం తప్పకుండా పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను గ్రూప్ సభ్యులు సకాలంలో క్రమం తప్పకుండా చెల్లించాలని కరకగూడెం మండలం ఏపీఎం వినోద్ క్రాంతి సూచించారు. గత రెండు రోజులుగా మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో 27 గ్రామ సమాఖ్య సంఘాలతో నిర్వహిస్తున్న శిక్షాణా ముగింపు కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. క్రమం తప్పకుండా గ్రామాల్లోని సంఘాలు సమావేశాలు నిర్వహించుకుంటూ పొదుపులు, అప్పులు సకాలంలో చెల్లించాలన్నారు. మహిళ సంఘాలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని నిర్వహణ కార్యక్రమం చేపట్టాలన్నారు. తద్వారా సామాజిక, ఆర్ధిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం పలు అంశాలపై జెండర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెర్చ్ స్టేట్ రిసోర్స్ పర్సన్లు జ్యోతి, దీవెన, సీసీలు విజయలక్ష్మీ, సత్యనారాయణ, మండల సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి, సిబ్బంది పీత్రీ పాల్గొన్నారు.