మహనీయుల త్యాగాలు మరువలేనివి
మహనీయుల త్యాగాలు మరువలేనివని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రాం దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నారు.
- అంబేద్కర్, జగ్జీవన్‌రాం సేవలు చిరస్మరణీయం
- విగ్రహాల ఆవిష్కరణలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
తల్లాడ, జూన్ 26: మహనీయుల త్యాగాలు మరువలేనివని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రాం దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని అన్నారు. మండలంలోని తెలగవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాలను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకుడు ఏపూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. దేశానికి రిజర్వేషన్లు అందించి అన్ని వర్గాలకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించిన అంబేద్కర్ అందరి వాడని అన్నారు. నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకుసాగాలని సూచించారు. విద్య, వైద్యంతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. సత్తుపల్లిలో రూ.25 లక్షలతో అంబేద్కర్ కాంస్య విగ్రహంతోపాటు జగ్జీవన్‌రాం విగ్రహాలను తాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహనీయుల విగ్రహాలను గ్రామాల్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ఎంపీవో శ్రీదేవి, సర్పంచ్ తేల్లూరి కృష్ణయ్య, యూడీసీ చైర్మన్ మువ్వా మురళీధర్‌రావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ కేతినేని చలపతిరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

