ఖమ్మం రూరల్, జనవరి 10: సంక్రాంతి పర్వదినాన్ని మహిళలు సంబురంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం మండలంలోని వరంగల్ క్రాస్‌రోడ్‌లోని తరుణిహాట్లో ఏదులాపురం బీఆర్ఎస్, సీపీఎం గ్రామశాఖల ఆధ్వర్యంలో మహిళలకు రంగోలి పోటీలను నిర్వహించారు. ఏదులాపురం, వరంగల్ క్రాస్‌రోడ్‌లోని పలు కాలనీల నుంచి సుమారు వెయ్యి మంది మహిళలు ముగ్గుల పొటీలో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరచిన మహిళలకు, పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు ఎమ్మెల్యే కందాళ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయలను ఎల్లవేళల కాపాడుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభిందించారు. హాజరైన మహిళలకు ముందస్తు బోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, రూరల్, నేలకొండపల్లి బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మండల ఉపాధ్యక్షుడు వెంపటి రవి, వెంపటి ఉపేందర్, సీపీఎం నాయకుడు ఊరడి సుదర్శన్‌రెడ్డి, నిర్వాహకులు మిర్యాల వరుణ్‌తేజ్, చంద్రారెడ్డి, పొన్నం సాయి, కృపాకర్, జీవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రియదర్శిని’ కళాశాలలో..
ఖమ్మం రూరల్, జనవరి 10: మండలంలోని పెద్దతండాలోని పియదర్శిని కళాశాలలో మంగళవారం సంక్రాంతి సంబురాలు జరిగాయి. బోగి మంటలు, హరిదాస్ వేషధారణలు, ముగ్గుల పోటీల్లో విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్‌బాబు మాట్లాడుతూ నేటి తరాలకు సంక్రాంతి పండుగ ఆవశ్యకత తెలియాలనే ఉద్దేశంలో సంబురాలు చేసుకోవడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ బీ గోపాల్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
సర్వీసు సొసైటీ ఆధ్వర్యంలో
నేలకొండపల్లి, జనవరి 10: మండలంలోని రాజేశ్వరపురంలో భక్త రామదాసు సర్వీసు సొసైటీ, సంతూరు సోప్స్ వారి ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో 200 మంది మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులను అందించారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అక్కినేని లక్ష్మి, పాలడగు జయలలిత, సుంకర ఉజ్వల వ్యవహరించారు. అంగ్లభాషపై మండల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు యలమద్ది లెనిన్, కార్యదర్శి పాలడగు పూర్ణచంద్రప్రసాద్, కోశాధికారి బోనగిరి యుగంధర్, గెల్లా జగన్మోహన్రావు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, నెల్లూరి వీరబాబు, దుర్గారావు, భాస్కర్‌రావు, వెంకటరమణ, నారాయణరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.