కొత్తగూడెం టౌన్, జనవరి 14 : కల్లాల్లో ధాన్యపు రాశులు.. వీధు ల్లో హరిదాసుల కీర్తనాలపనలు.. డూ డూ బసవన్నల విన్యాసాలు.. ఇండ్ల ముందు రంగవల్లుల కళకళలు.. పిండి వంటల ఘుమఘుమలు.. ఇలా పల్లెలన్నీ సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మనం ఏటా ఈ పం డుగ జరుపుకొంటాం. సోమవారం పండుగ జరుపుకొనేందుకు ఉ మ్మడి జిల్లావాసులు సిద్ధమయ్యారు. బతుకుదెరువుకు ఇతర ప్రాం తాలకు వెళ్లి పండుగ జరుపుకొనేందుకు వచ్చిన వారితో పల్లెలు కళకళలాడుతున్నాయి. కొత ్తఅల్లుళ్లకు ఈ పండుగ మరీ ప్రత్యేకం. ఎక్కడున్నా భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్లడం ఈ పండుగ ప్రత్యేకత. కొందరు ఇదే రోజు పితృ తర్పణాలు సమర్పిస్తారు.
ప్రధాన కూడళ్లలో రద్దీ..
సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణాలు, పల్లెల్లోని ప్రధాన కూడళ్లు రద్దీగా కనిపించాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు కిక్కిరిశాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతూ దర్శనమిచ్చాయి. టీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా కేటాయించిన బస్సు సర్వీసులు సైతం ప్రయాణికులతో నిండాయి. కొందరు ప్రయాణికులు సొంతూరికి చేరుకునేందుకు కార్లను సైతం హైర్ చేసుకుని గమ్యస్థానాలు చేరుకున్నారు. కొనుగోలుదారులతో వ్యాపార సముదాయాలు రద్దీగా కనిపించాయి. వస్ర్తాలు, ఆభరణాలు కొనేవారితో కిటకిటలాడాయి.
పతంగులకు గిరాకీ..
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మార్కెట్లో పతంగులకు మంచి గిరాకీ ఉన్నది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు చెందిన పిల్ల లు పతంగులు ఎగురవేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం రకరకాల పతంగులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో పతంగి రూ.5 నుంచి రూ.500 వరకు ధర పలుకుతున్నాయి. పిల్లలు పతంగులు ఎగురవేసేటప్పుడు పెద్దలు వారిని గమనిస్తూ ఉండాలని, ముఖ్యంగా డాబాలపై ఎగురవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైలుపట్టాలు, ప్రధాన రహదారులు, చెరువులు, కుంటల పక్కన అసలు ఎగరవేయకపోవడం శ్రేయస్కరం.
రేపు కనుమ
సంక్రాంతి తర్వాతి రోజును మనం కనుమ అంటాం. ఈరోజు రైతుల ఇండ్లలో మహిళలు పశువులను దేవతలుగా పూజిస్తారు. వ్యవసాయానికి మరింత సాయపడాలని వాటిని వేడుకుంటారు. ఇదేరోజు మాంసాహారం వండి ఇంటిల్లీపాది ఆరగిస్తారు. భోగి, సంక్రాంతి రోజు మంసాహారం తినని వారంతా కనుమరోజు తినేందుకు ఇష్టపడతారు. కొందరు పలు రకాల మంసాహారాలు వండి బంధుమిత్రులతో కలిసి తింటూ ముచ్చట తీర్చుకుంటారు.