ఖమ్మం: రైతుబంధు సంబురాలలో భాగంగా టిఆర్ఎస్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని వివిధ పాఠశాలలో విద్యార్ధులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్వి నేతలు షేక్ బాజీ బాబా, బొజెడ్ల దిలీప్ లు మాట్లాడుతూ తెలంగాణలో రైతుబంధు ప్రాముఖ్యతను, వ్యవసాయం రంగం ప్రాధాన్యతను వివరిస్తూ వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత, ఆ రంగం పైఆధారపడిన రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పథకాల పట్ల విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ వేయడం ద్వారా రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. రైతు బీమా ద్వారా తెలంగాణలో అనేక కుటుంబాలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.