ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జిల్లా జడ్పి చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో మధిరలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మధిరలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో కలసి నిర్వహించారు.
ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలుగ్రామాల రైతులు, టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.