– ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు ఆర్పీఎల్ శిక్షణ కార్యక్రమం
– హాజరైన ఆత్మ ఏడీ ఈ.రాజేశ్
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 10 : ఆత్మ ఆధ్వర్యంలో Recognition of Prior Learning (RPL) శిక్షణ కార్యక్రమం గురువారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెం రైతు వేదిక నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సహాయ వ్యవసాయ సంచాలకులు ఈ.రాజేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంటల సాగు, రక్షణ చర్యలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటలను రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కేవీకే శాస్త్రవేత్తలు రైతులకు సహజ వ్యవసాయం (Natural Farming) పై అవగాహన కల్పించారు. సహజ వ్యవసాయంలో భాగంగా సస్య రక్షణ చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
అదేవిధంగా జీవన ఎరువుల ప్రాముఖ్యత, నీమాస్త్రం, బీజామృతం, ద్రవ బీజామృతం, బ్రహ్మాస్త్రం ల పనితీరుపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం రైతు శిక్షణా కేంద్రం నిర్వాహకులు, అగ్రికల్చర్ ఆఫీసర్ వి.భాస్కర్ మాట్లాడుతూ.. ఎల్నినో నేపథ్యంలో పంటల రక్షణ చర్యలు, ప్రత్యామ్నాయ పంటలు అలాగే వాటి సాగుపై విపులంగా రైతులకు వివరించడం జరిగింది. నియోజకవర్గ ఉద్యానవన అధికారి అపర్ణ మాట్లాడుతూ.. ఉద్యానవన శాఖకు సంబంధించి రాయితీ వివరాలను రైతులకు వివరించడం జరిగింది. ఎల్ నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ కూరగాయల పంటల గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. చివరగా సహాయ ఈ కార్యక్రమంలో ఎంఏఓ ఉమా నరేశ్, ఏఈఓలు, కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.