అమరావతి : ఏపీ కూటమి పాలనలో గత యేడాది నిర్వహించిన డీఎస్సీ-2025 ( DSC )నియమకాల్లో జరిగిన అక్రమాలు తవ్వ్వేకొద్ది మరిన్ని వాస్తవాలు బయటపడు తున్నాయని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohanreddy ) తెలిపారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత కొన్ని రోజులుగా డీఎస్సీ అక్రమాలపై ఎన్నో ప్రశ్నలు,అనుమానాలు వ్యక్తం చేసినా గాని సీఎం చంద్రబాబు ( Chandra Babu ), మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh ) నుంచి సమాధానం రావడం లేదని ఆరోపించారు. స్కాం జరిగిందని వ్యక్తులు, సోషల్ మీడియా ఆధారాలతో చూపిస్తే చంద్రబాబుకుకు అమాంతం బీపీ పెరిగిపోతుందని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండానే 372 మందికి ఉద్యోగాలు కట్టబెట్టారని, అందుకోసం ప్రత్యేక జీవోలు విడుదల చేసి రిక్రూట్ మెంట్ అయ్యాక ఆ జీవోలు మార్చివేశారని ఆరోపించారు. కొడుకు నారా లోకేశ్‌ను కాపాడుకోవాలనే ఆరాటంలో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి స్కామ్‌ల వల్లే కాక్రోచ్ పార్టీలు పుట్టుకొస్తున్నాయని వెల్లడించారు. చంద్రబాబు కుంభకోణాల చరిత్రలో డీఎస్సీ స్కామ్ అనేది ఓ ఆణిముత్యమని ఎద్దేవా చేశారు.