‘హింస నిరోధంలో స్థానిక నాయకత్వం పాత్ర కీలకం’
హింస నిరోధంలో స్థానిక నాయకత్వం పాత్ర చాలా కీలకమని ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ శివనాదుల శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఆధ్వర్యంలో..
ఖమ్మం రూరల్, మే 01 : హింస నిరోధంలో స్థానిక నాయకత్వం పాత్ర చాలా కీలకమని ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ శివనాదుల శ్రీనివాస్ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఖమ్మం రూరల్ మండల పరిషత్ కార్యాలయం నందు సర్పంచులు, ఉప సర్పంచులు, స్థానిక నాయకులకు “సామాజిక నాయకత్వం, స్థానిక ప్రభావశీలు హింస నిరోధంలో నాయకుల పాత్ర ” అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో హింస అనేది అందరి జీవితాలను దెబ్బ తీస్తోందన్నారు. సమాజాన్ని మార్చడానికి, సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
గ్రామాలలో, కాలనీలలో హింస నిరోధానికి స్థానిక న్యాయకత్వం ముందంజలో నిలబడాలన్నారు. వారు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి మహిళలు, పిల్లల హక్కుల గురించి చెప్పాలన్నారు. బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా, బానిసత్వ కార్మికుల సమస్యలపై ఎన్జీఓలు, స్థానికులు కలిసి పోరాడాలని, గ్రామ ప్రథమ పౌరులుగా హింసను తిరస్కరించి ముందుకు సాగాలన్నారు. సమాజంలో ఐక్యత సృష్టించాలి – గ్రామ సభలు, సమావేశాలలో చర్చలు నిర్వహించి తెలియజేయాలి. డయల్ 100, సైబర్ నేరాల కోసం 1930 లాంటి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ఐ జ్యోతి, ఏ హెచ్ టి యు – భాస్కర్, ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె.శ్రీనివాస్ కానిస్టేబుల్ రుక్మిణి, మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ పద్మావతి, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

