వైరా రూరల్, ఫిబ్రవరి 24: వైరా మండలంలోని పలు గ్రామాల మధ్య రహదారులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. రెబ్బవరం – ఖానాపురం, గన్నవరం మీ దుగా నెమలి వరకు నిత్యం వేలాదిగా భారీ వాహనాలు తిరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్లోని నెమలి గ్రామం లో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో జాతరలు జరుగుతుంటాయి. వీటికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.
రోడ్లు దెబ్బతిని ఉండడం, భారీ మూలమలుపు వద్ద కనీసం సూచిక బోర్డులు కూడా లేకపోవడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వైరా రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల కల్వర్టుల వద్ద రక్షణ గోడలు, సైడ్వాల్స్ విరిగి ప్రమాదకరంగా మారాయి. సంబంధిత అధికారులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.