కారేపల్లి, ఏప్రిల్ 16 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో గల వైఎస్ఎన్ గార్డెన్ లో గురువారం ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి కె.చందనకుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులు సమగ్రంగా చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, సూపరింటెండెంట్ మల్లెల రమేశ్, వ్యవసాయాధికారి బట్టు అశోక్ కుమార్, విద్యాశాఖ అధికారి జయరాజు, వైద్యాధికారి సురేష్, ఐకేపీ ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ సీడీపిఓ దయామణి, ఇతర ప్రభుత్వ శాఖ అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.

‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’పై కారేపల్లిలో సమీక్షా సమావేశం