కాంగ్రెస్‌కు ఓట్లేసిన ప్రజల్లో పునరాలోచన
“కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్నీ వైఫల్యాలే. ఆ పార్టీకి ఓట్లేసిన ప్రజలు.. ఇవన్నీ చూస్తూ, పునరాలోచనలో పడ్డారు” అని, బీఆర్ఎస్ నేతలైన ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు.
- బీఆర్ఎస్ సమావేశంలో నేతలు నామా, వద్దిరాజు, తాతా
చింతకాని, ఏప్రిల్ 2: “కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్నీ వైఫల్యాలే. ఆ పార్టీకి ఓట్లేసిన ప్రజలు.. ఇవన్నీ చూస్తూ, పునరాలోచనలో పడ్డారు” అని, బీఆర్ఎస్ నేతలైన ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. బీఆర్ఎస్ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం ప్రోద్దుటూరు గ్రామంలో జరిగింది. వారు మాట్లాడుతూ.. అబద్ధపు, అసాధ్యపు హామీలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మాయచేసి అధికారంలోకి వచ్చిందని, కేవలం 100 రోజుల్లోనే చేతులెత్తేసిందని అన్నారు. “కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హమీలే మనకు శ్రీరామరక్ష.” అని, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. పదేళ్ళలో లేని కరువు 100 రోజుల్లోనే వచ్చిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
పాలేరులో నీరు అడుగంటడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, పార్టీ నాయకులు పెంట్యాల పుల్లయ్య, తిరుపతి కిషోర్, గడ్డం శ్రీనివాసరావు, మంకెన రమేష్, వేముల నర్సయ్య, నూతలపాటి వెంకటేశ్వర్లు, పఠాన్ షబ్బీర్‌ఖాన్, బోగ్గారపు రాంబాబు, బండి రామారావు, తిరుపతి కొండలు, తుడుం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

