మధిర, జూలై 30 : మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం జిల్లా మత్స్య హడ్ హక్ కమిటీ చైర్మన్ మామిడి వెంకటేశ్వరరావు, సెక్రెటరీ యంగల రవి అన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నందు మత్స్య శాఖ కమిషనర్ కె.నిఖిల ను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో మత్స్యకారులు అకాల వర్షాలు, వరదలకు నష్టపోయేరన్నారు. బాధిత మత్స్యకారులకు రావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య హడ్హక్ కమిటీ సభ్యులు షేక్ మీరా, ఎండీ కాశీం, తవడబోయిన కృష్ణ పాల్గొన్నారు.