మధిర, నవంబర్ 28 : మధిర పట్టణంలోని నివాస ప్రాంతంలో వైన్ షాపుల ఏర్పాట్లను నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్కు, ఎక్సైజ్ ఎస్ఐ కు స్థానిక మహిళలు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్తగా వైన్ షాపులు దక్కించుకున్న యజమానులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. ముందస్తుగా వైన్ షాప్ లైసెన్స్ దారులకు సమాచారం ఇచ్చి వాటిని జన నివాసం లేని ప్రాంతాల్లో ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకు వెళ్తామని తెలిపారు.

Madhira : నివాస ప్రాంతాల్లో వైన్ షాపుల ఏర్పాటు నిలిపివేయాలని వినతి