కారేపల్లి, ఏప్రిల్ 14 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కారేపల్లి మండల ప్రజలకు ఉపయోగపడేలా ఇల్లందు-డోర్నకల్ ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను నడపాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కారేపల్లి మండల కార్యదర్శి బి.శివనాయక్ సోమవారం అధికారులను కోరారు. ఇల్లందు బస్ డీపో ఎస్టీఐ సంజురాణిని కలిసి ఈ మేరకు వినతిప్రతం అందజేశారు. ఇల్లందు నుండి వయా కారేపల్లి, గేటుకారేపల్లి, మేకలతండా, దుబ్బతండా, కమలాపురం మీదుగా ఆర్టీసీ సర్వీస్ నడపాలని, దీని ద్వారా ఆదాయంతో పాటు మండల వాసులకు రవాణా సౌకర్యం మెరుగవుతుందని వినతిపత్రంలో కోరారు. దీనిపై ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.