ఆళ్ళపల్లి, అక్టోబర్ 6 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన సర్కార్లా కాంగ్రెస్ మిగిలిపోయిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. మర్కోడు గ్రామంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేసిన కాంగ్రెస్ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేరవేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించడానికి ఎదురుచూస్తున్నారని అన్నారు. సమావేశంలో మాజీ జడ్పీటీసీ కొమరం హన్మంతరావు, మాజీ ఎంపీపీ కొండ్రు మంజుభార్గవి, పీఏసీఎస్ చైర్మన్ గొగ్గల రామయ్య, పార్టీ మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కిశోర్‌బాబు, పొదిల రాము, నరసింహారావు, శంకర్‌బాబు, వెంకటకృష్ణ, ఆదాం, సందీప్, నరేశ్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.