భద్రాద్రి కొత్తగూడెం(నమస్తే తెలంగాణ)/నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 3 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం ఆపాలని, హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపు మేరకు బీఆర్ఎస్, యువజన విభాగం, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా గురువారం నిరసనలు, రాస్తారోకోలు చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మణుగూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బోశెట్టి రవిప్రసాద్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
నాయకులు గుర్రం సృజన్, బానోత్ రమేశ్, పద్దం శ్రీనివాస్, హర్షవర్ధన్, మారోజు రమేశ్, జక్కం రంజిత్, బోయిల రాజు, వత్సవాయి చైతన్య పాల్గొన్నారు. ఇల్లెందు కొత్త బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్, కుమ్రంభీం విగ్రహాల ఎదుట బీఆర్ఎస్, యువజన విభాగం, బీఆర్ఎస్వీ నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని ప్ల కార్డులతో నిరసన తెలిపారు. నాయకులు గిన్నారపు రాజేశ్, సత్తాల హరికృష్ణ, కాసాని హరిప్రసాద్, భూక్య సురేశ్, కొండు రవికాంత్, నీలం రాజశేఖర్, లలిత్‌కుమార్ పాసి, చాంద్‌పాషా, నిఖిల్, ఇమ్రాన్ పాల్గొన్నారు. పాల్వంచ పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ జిల్లా నాయకురాలు సింధు తపస్విని ఆధ్వర్యంలో యువజన విభాగం, బీఆర్ఎస్వీ నాయకులు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అఖిల్, మహర్షి, హసీబ్, వెలదండి రాజేశ్, అబ్దుల్, రాకేశ్, గణేశ్, విజయ్, రోహిత్ పాల్గొన్నారు.
భద్రాచలంలో బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో తెలిపిన నిరసన కార్యక్రమంలో నాయకులు కొలిపాక శివ, కీసరి యువరాజు, ఆకోజు పృథ్వీ, జాగు సాయిరాం, గొల్ల గణేశ్, రోహిత్పాషా పాల్గొన్నారు. దుమ్ముగూడెంలోని మండల కేంద్రమైన లక్ష్మీనగరం ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ అనుబంధ యూత్ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయకులు లంకా శివ, వాగే కిట్టు, కణితి రాముడు, ఎండీ.జానీపాషా, తునికి కామేష్, రాజేశ్, సూర్య, నర్సింహారావు పాల్గొన్నారు.
అశ్వారావుపేటలో బీఆర్ఎస్, యువజన విభాగం ఆధ్వర్యంలో రింగ్ రోడ్డు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. నాయకులు మోటూరి మోహన్, సత్వవరపు సంపూర్ణ, వగ్గెల పూజ, నారం రాజశేఖర్, సోమాని రమేశ్, శెట్టిపల్లి రఘురాం, తగరం హరి, సాయి పాల్గొన్నారు. చండ్రుగొండలో బీఆర్ఎస్ యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మొండివైఖరి వీడి యూనివర్సిటీ భూముల వేలం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పర్యావరణానికి విఘాతం కలిగించే చర్యలు చేపడితే చూస్తూ ఊరుకోమని, వన్యప్రాణులకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని కోరారు.