కారేపల్లి, మే 11. మండల పరిధిలోనిఅప్పాయి గూడెం గ్రామపంచాయతీ పరిధి బిక్య తండా గ్రామంలో రామాలయం ధ్వజస్తంభం, గ్రామదేవతల ప్రతిష్ట ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. గ్రామ పెద్దలు అజ్మీర బిచ్చ నాయక్, వాంకుడోత్ రాములు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుంచి ఆలయంలో గణపతి పూజ, ప్రత్యేక చండీ రుద్రహోమాలు, మహాలక్ష్మి హోమాలు, సువాసీనులచే సహస్ర కుంక మార్చన జరిపారు.
వేడుకలో భాగంగా జలాధివాస, క్షీరాదివాస, ధాన్యాదివాస, పుష్పాదివాస, సయ్యాధివాసా వంటి కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు బీ వాసుదేవ శర్మ, బీ భరద్వాజ శర్మ, ఎన్ నాగేంద్ర శర్మ, రోహిత్ శర్మల తోపాటు పలువురు పూజారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అన్నదానం కార్యక్రమం

గ్రామదేవతల విగ్రహాల ప్రతిష్ట అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ ప్రాంగణంలో కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని మండల మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న ప్రారంభించారు.