మధిర, సెప్టెంబర్ 15 : భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన IRCTC (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక రైలు, విమాన ప్యాకేజీలను ప్రకటించింది. మధిర రైల్వే స్టేషన్‌లోని వీఐపి లాంజ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో IRCTC అసిస్టెంట్ మేనేజర్ పి.వి.వెంకటేష్ వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ’దివ్య దక్షిణ యాత్ర’ ప్యాకేజీలో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు వంటి ప్రముఖ క్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. యాత్ర ఈ నెల 23న ప్రారంభమై, 30న ముగుస్తుంది (8 రోజులు, 7 రాత్రులు).
స్లీపర్ (SL) : రూ.14,100
3AC: రూ.22,500
2AC: రూ.29,500 ఉంటాయన్నారు.
సికింద్రాబాద్, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లు
రైలు ప్రయాణం, బస్సు సౌకర్యం, హోటల్ వసతి.
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం. ఒక వాటర్ బాటిల్.
టూర్ ఎస్కార్ట్ సేవలు, ప్రయాణ బీమా.
రైల్వే స్టేషన్ల నుండి దేవాలయాల వరకు ఉచిత ప్రయాణం,
భద్రత, ఇతర సేవలు లభిస్తాయన్నారు.
ప్రతి రైలులో 639 మంది, ప్రతి 70 మందికి ఇద్దరు కో ఆర్డినేటర్లు అందుబాటులో ఉంటారన్నారు.
ప్రతి కోచ్‌కు ఒక సెక్యూరిటీ గార్డు. రైలులో సీసీ కెమెరాల ద్వారా పూర్తి భద్రత కల్పిస్తారన్నారు.
టికెట్లు బుక్ చేసుకోవడానికి: 9701360701, 9281030726, 9281030750 నంబర్లను సంప్రదించవచ్చు.
మరిన్ని వివరాల కోసం : www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.