ఖమ్మం మార్చి 9: పేదలు కూడా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు విలువైన రంజాన్ కిట్లను జవాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం అభినందనీయమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న మకా మసీదులో ‘అవామే ఏ హింద్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ఫౌండేషన్’ చైర్మన్ హాఫిజ్ మహమ్మద్ జవ్వాద్ అహ్మద్ ఆధ్వర్యంలో ఆదివారం రంజాన్ కిట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పువ్వాడ ముఖ్య అతథిగా హాజరై మాట్లాడారు. 13 ఏళ్లుగా జవ్వాద్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు రంజాన్ కిట్లు పంపిణీ చేస్తుండడం గొప్ప విషయమని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ విభాగం బాధ్యులు పగడాల నాగరాజు, మహమ్మద్ తాజుద్దీన్, డి.వెంకటేశ్వర్లు, శీలంశెట్టి వీరభద్రం ఎన్.కోటి, బచ్చు విజయకుమార్, మకా మసీదు అధ్యక్షుడు అలీఖాన్, మసీదు ఇమామ్ హాఫిజ్ సయ్యద్ సలీం పాల్గొన్నారు.