రఘునాథపాలెం, మే 2: వచ్చే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి బీఆర్ఎస్ సత్తా చాటుదామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ఇకపై రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్దే హవా సాగుతుందని అన్నారు. ఈ నెల 7న కేఎంసీ కార్పొరేటర్ల పదవీకాలం పూర్తికానుండడంతో శనివారం ఖమ్మం మమత ఆసుపత్రిలోని పువ్వాడ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది.
దీనికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని 16మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఖమ్మం సర్వాంగ సుందరంగా తయారైందన్నారు. నగరాభివృద్ధిలో భాగస్వామ్యమై ప్రజల మనస్సులను దోచుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఆయన అభినందించారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించేందుకు ఇప్పటినుంచే ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్, బీఆర్ఎస్ నాయకులు మందడపు నర్సింహారావు, చిలుమూరు కోటి, దేవభక్తుని కిశోర్‌బాబు, శ్రీను, కిరణ్, సద్దాం, నాగచంద్రారెడ్డి, బత్తుల మురళి, వెంకన్న, శ్రీశైలం, వెంకటేశ్వరరావు, పద్మ, షకీనా, ధనలక్ష్మి పాల్గొన్నారు. సన్మాన గ్రహీతల్లో దండా జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటేశ్వరరావు, కూరాకుల వలరాజు, బిక్కసాని ప్రశాంతలక్ష్మి, జశ్వంత్, పల్లా రోజ్లీనా, షేక్ మక్బూల్, ముక్కాల కమల, పసుమర్తి రామ్మోహన్రావు, కర్నాటి కృష్ణ, బుడిగెం శ్రీనివాస్, మాటేటి అరుణ, తోట గోవిందమ్మ, శీలంశెట్టి రమ, ముర్రి వెంకటేశ్వర్లు, పగడాల శ్రీవిద్య ఉన్నారు.