ఖమ్మం సిటీ, మే 28: తెలుగు ప్రజలు మరిచిపోని అభిమాన నాయకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆనాటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని స్థాపించి అందరి మన్ననలూ పొందారని కీర్తించారు. సుదీర్ఘకాలంగా మనుగడ సాగిస్తున్న ప్రాంతీయ పార్టీలు టీడీపీ, బీఆర్ఎస్ మాత్రమేనని గుర్తుచేశారు. ఎక్కడా లేని విధంగా తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ మీద ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించి, ఆయన చరిత్రను శిలాఫలకాలపై లిఖించామని జ్ఞప్తికి తెచ్చారు. కానీ కొందరు వాటిని ధ్వంసం చేశారని ఆరోపించారు.
అంతటి విద్వేషం ఎందుకని ప్రశ్నించారు. సినీ, రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన గొప్ప నాయకుడి ఎన్టీఆర్ అని అభివర్ణించారు. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, తాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నేతలు వల్లభనేని రామారావు, కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, కర్నాటి వీరభద్రం, తాళ్లూరి జీవన్, బిక్కసాని ప్రశాంతలక్ష్మి జస్వంత్, నాగండ్ల కోటేశ్వరరావు, బత్తుల మురళి, సామినేని హరిప్రసాద్, వీరూనాయక్, పొన్నం వెంకటేశ్వర్లు, సిరిపురపు సుదర్శన్, మోరంపూడి ప్రసాద్, కొల్లు పద్మ, షకీనా, జయకర్, రావూరి శ్రీను, హరిప్రసాద్, కోటేశ్వరరావు, గుత్తా రవి, రామారావు, ప్రదీప్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.