కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 27: లైసెన్స్ ఉన్న విక్రేతల నుంచే దీపావళి పటాకులను కొనుగోలు భద్రాద్రి జిల్లా ఫైర్ అధికారి మురహరి క్రాంతికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. భవనాలు, వాహనాలు, మండే స్వభావమున్న పదార్థాలకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పటాకులు పేల్చాలని సూచించారు. పటాకులు కాల్చేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలని,
మంట సులువుగా అంటుకునేవి ధరించవద్దని, దగ్గరలో కనీసం బకెట్ నీరు కచ్చితంగా ఉంచుకోవాలని, చిన్న పిల్లల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పటాకులను కాల్చిన తరువాత వాటిపై నీరు పోస్తే నిప్పు రవ్వలు ఆరిపోతాయని అన్నారు. లైసెన్స్ లేకుండా పటాకులను విక్రయిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు.