ఖమ్మం రూరల్, మే 19 : పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి కార్మిక వర్గానికి ఆదర్శం కావాలని సిఐటియు రాష్ట్ర కమిటీ కార్యదర్శి పెరుమాళ్లపల్లి మోహన్ రావు అన్నారు. పేదల పెన్నిధి, భారత దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ఆశా జ్యోతి, తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన మహానేత పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు. మంగళవారం సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం రూరల్ మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో వర్ధంతి సభ నిర్వహించారు. జిల్లా ఆల్ ఆటో మోబైల్ షోరూమ్స్ కమిటీ ఆధ్వర్యంలో షోరూం దగ్గర నిర్వహించిన సభలో జిల్లా అధ్యక్షుడు బిమగాని నాగ శ్రీనివాసరావు, కోశాధికారి గర్రేపల్లి ప్రవీణ్, ఉపాధ్యక్షులు బూసిపోగు వెంకటేశ్వరరావు, ప్రకాష్, గోవర్ధన్, నరేష్, వసంత బాబు, శ్రీకాంత్, రాంబాబు, రవి పాల్గొన్నారు.