కారేపల్లి, ఏప్రిల్ 19 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లి గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి కుందనపల్లి నరేంద్ర మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు.
పంచాయతీ కార్మికులకు నెలనెలా వేతనాలు చెల్లించి, అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొండబోయిన నాగేశ్వరరావు, ఉమావతి, తలారి దేవప్రకాశ్, అన్నారపు కృష్ణ, ముండ్ల ఏకాంబరం, పాసిని నాగేశ్వరరావు, వీరమల్లు, యాసిన్, చంద్రయ్య, వీరమ్మ పాల్గొన్నారు.