సత్తుపల్లి: సింగరేణి (Singareni) కాలుష్యం నుంచి కాపాడాలంటూ సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్‌వాసులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కిష్టారం ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని తరలింపునకు సంబంధించి ఏర్పాటు చేసిన సైలో బంకర్ కాలుష్యం వెదజల్లుతున్నదని, దానినుంచి తమను కాపాడాలంటూ కాలనీ వాసులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కాలుష్యం వల్ల ఏడాది కాలంలో 16 మంది మరణించారని వాపోయారు. సింగరేణి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆందోళనకు దిగామని, తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేతా బంకర్ నుంచి వచ్చే బొగ్గు కాలుష్యానికి నివారణా చర్యలు తీసుకోవాలన్నారు. అప్పటివరకు తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని వెల్లడించారు.